పుట్టుక
ఈ రోజున భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక తమిళుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి కారణాలు. పుట్టుక విషయానికి వస్తే, భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా, ప్రస్తుతం వాడుకలో ఉన్న భరతనాట్యశాస్త్రాన్ని ఒక తాటి పైకి తెచ్చి, అమలు పరచిన వారు తంజఊర్ కి చెందిన పొన్నయ్య, చెన్నయ్య, వడివేలు, శివానందం అనబడే నలుగురు అన్నదమ్ములయిన నట్టువన్నులు.
వీరు పధ్ధెనిమిదవ (18) శతాబ్దానికి చెందినవారు. విద్వాన్ శ్రీ మీనాక్షీ సుందరం పిళ్ళై వీరి వారసులే. ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి, ఒక వినోదంగా కాకుండా, ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి, సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు శ్రీ రుక్మిణీదేవి అరుండలే. ఈమె మద్రాసు దగ్గరి తిరువన్మయూర్ లో " కళాక్షేత్ర " అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు
Super blog
ReplyDelete